Pegasus: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం

Pegasus: దేశంలో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2021-07-19 15:45 GMT

Pegasus: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం

Pegasus: దేశంలో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ అంశం మరోసారి దేశాన్ని కుదిపేస్తోంది. రెండేళ్ల క్రితం భారత్‌లో పలువురు మేథావులు, హక్కుల నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే పెగాసస్‌ స్పైవేర్‌ వార్తల్లోకి వచ్చింది. పెగాసెస్ హ్యాకింగ్ వ్యవహరంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాటు పలువురు ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ది వైర్ వార్తా సంస్థ బయటపెట్టింది. బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, మాజీ సీఈసీ అశోక్‌ లావాసా, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ పటేల్‌, పీకే సన్నిహితుల ఫోన్‌ నంబర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. పెగాసస్‌తో హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. హ్యాకింగ్ కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నవని కేంద్ర ఐటీశాఖ మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News