Rahul Gandhi: ఆయనంటే కోపంలేదు.. ప్రధాని మోడీపై రాహుల్‌గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rahul Gandhi: మోడీ అంటే నాకు ద్వేషం లేదు
Rahul Gandhi
Rahul Gandhi: భారత ప్రధాని మోడీపై ఎప్పుడూ విమర్శలు చేసే రాహుల్‌గాంధీ తొలిసారి మోడీపై పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ప్రధాని మోడీ అంటే తనకు ద్వేషం లేదని రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. మోడీకి ఒక ప్రత్యేకమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని, దానిని మాత్రమే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. తమ ఇద్దరి సైద్ధాంతిక అభిప్రాయాలు మాత్రమే వేరని అన్నారు. వ్యక్తిగతంగా ఆయనంటే తనకు ఎలాంటి కోపం, ద్వేషం కానీ లేదన్నారు రాహుల్‌గాంధీ.