Punjab Lottery Winner 2025: పంజాబ్‌లో రూ.11 కోట్లు గెలుచుకున్న లాటరీ విజేత ఇంకా రహస్యమే!
Punjab Lottery Winner 2025: దీపావళి బంపర్ లాటరీలో రూ.11 కోట్ల జాక్‌పాట్ గెలుచుకున్న అదృష్టవంతుడు ఎవరో ఇంకా బయటకు రాలేదు. పంజాబ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Punjab Lottery Winner 2025: పంజాబ్‌లో రూ.11 కోట్లు గెలుచుకున్న లాటరీ విజేత ఇంకా రహస్యమే!
Punjab Lottery Winner 2025: పంజాబ్‌లో దీపావళి బంపర్ లాటరీలో రూ.11 కోట్ల జాక్‌పాట్ తగిలిన అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వం లాటరీ ఫలితాలు ఇప్పటికే ప్రకటించినా, విజేత మాత్రం ఇప్పటివరకు బయటకు రాకపోవడంతో సర్వత్రా చర్చ మొదలైంది.
భఠిండాలోని రతన్ లాటరీ సెంటర్లో ఈ టికెట్ విక్రయించబడింది. ఆ సెంటర్ యజమాని ఉమేశ్ మాట్లాడుతూ, “మా వద్ద టికెట్లు కొనేవారిలో దాదాపు 40 శాతం మంది తమ వివరాలు ఇవ్వరు. ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకుంటారు. నేను 35–40 ఏళ్లుగా లాటరీలు అమ్ముతున్నాను. నా షాప్‌లో టికెట్లు కొని ఇప్పటివరకు 40 మందికి పైగా కోటీశ్వరులయ్యారు,” అని తెలిపారు.
లాటరీ నిబంధనల ప్రకారం విజేత 25 రోజుల్లోగా తమ టికెట్‌తో వచ్చి బహుమతిని క్లెయిమ్ చేసుకోవాలి. గడువు ముగిసేలోగా ఎవరూ రాకపోతే ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రూ.11 కోట్ల బహుమతిలో పన్నులు పోనూ, విజేత చేతికి సుమారు రూ.7.7 కోట్లు అందే అవకాశం ఉంది.
ఇక లాటరీ టికెట్ విక్రయించిన ఉమేశ్‌కు కూడా ప్రభుత్వం నుండి ప్రత్యేక కమీషన్ లభించనుంది. ఈ వార్త తెలియడంతో ఆయన దుకాణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు “ఆ అదృష్టవంతుడు ఎవరై ఉంటాడా?” అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.