Assembly Elections 2026: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. మహిళలకు పాతికవేల కోట్ల నజరానా

Assembly Elections 2026: ఏప్రిల్ నెలలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ప్రత్యేకంగా నగదు బదిలీ పథకాలను పార్టీలు హామీ ఇస్తున్నాయి

Update: 2026-03-29 08:09 GMT

Assembly Elections 2026

Assembly Elections 2026: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో నాలుగు, గెలుపు సూత్రంగా భావిస్తున్న నగదు బదిలీలపై పార్టీలన్నీ భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఈ పార్టీల మేనిఫెస్టోలు ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాలు ₹24,500 కోట్లను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తాయి. తాము అధికారంలోకి వస్తే, ఈ డబ్బు ఐదేళ్లపాటు వారి ఖాతాల్లోకి నిరంతరం జమ అవుతూనే ఉంటుందని ఆ పార్టీలు హామీ ఇచ్చాయి.

ఇప్పటికే..

ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ప్రత్యేక వేసవి ప్యాకేజీగా మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 జమ చేసింది. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం బిహు వేడుకల కోసం ఒక్కొక్కరికి రూ.4,000 అందించింది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం కూడా స్త్రీ సుఖం నగదు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా పది లక్షల మంది మహిళలు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున పొందుతున్నారు. బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరిలో లక్ష్మీ భండార్ పథకాన్ని రూ. 500 మేర పెంచింది.

ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో పడిపోయినా సరే, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది ₹5,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదే పథకం 2021 ఎన్నికలలో మమతా బెనర్జీ గెలవడానికి దోహదపడింది.

15 రాష్ట్రాల్లో అమలులో..

నాలుగు రాష్ట్రాల్లోని అన్ని పథకాల మహిళా లబ్ధిదారుల సంఖ్య 4.1 కోట్లు కాగా, మొత్తం ఓటర్ల సంఖ్య 1,789 కోట్లు. అంటే, మొత్తం లబ్ధిదారులలో నగదు పథకాల వాటా 23 శాతంగా ఉంది.

ప్రస్తుతం 15 రాష్ట్రాలు మహిళలకు నగదు సహాయం అందిస్తున్నాయి.

గత ఐదేళ్ల ఎన్నికల ధోరణులను పరిశీలిస్తే, మహిళలకు నగదు బదిలీలు అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఒకటి నుంచి 15కి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాలు ఏటా 13 కోట్ల మందికి పైగా మహిళలకు ₹2.46 లక్షల కోట్ల నగదును బదిలీ చేస్తున్నాయి, ఇది వారి మొత్తం బడ్జెట్‌లో 0.7 శాతానికి సమానం. జార్ఖండ్ వంటి రాష్ట్రం తన మొత్తం గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌లో 81 శాతాన్ని మహిళల నగదు బదిలీలకే కేటాయిస్తోంది.

అయితే, అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేసి, నగదు పథకాలపై ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు అనేక ప్రాజెక్టులను ప్రారంభించడంలో విఫలమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలు నగదు పథకాల కారణంగా కీలకమైన ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది.

అన్నిసార్లూ పనిచేయదు..

విభిన్న సిద్ధాంతాలు గల పార్టీలు ఎన్నికలలో గెలవడానికి ఒకే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. నిజానికి ఈ పథకం ఒక్కటే ఫలితాన్ని మార్చదు. బెంగాల్ పాటు దాదాపు అదే సమయంలో నగదు బదిలీలు అందించిన రెండవ ప్రభుత్వం ఏపీలో అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇది పాఠశాల వయస్సు పిల్లలు ఉన్న తల్లులకు కూడా నగదు బదిలీలు అందించింది. అయినప్పటికీ, ఆ పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. అలాగే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరా మహిళా సమ్మాన్ యోజన కూడా కాపాడలేకపోయింది. ఎన్నో ఎన్నికల పరిస్థితుల్లో ఈ పథకం కూడా ఓట్లను సాధించడానికి ఒక కారకంగా పనిచేస్తుంది.

మహిళలకు నగదు బదిలీ పథకంతో అధికారం మారిన రాష్ట్రాలివే..

  • మధ్యప్రదేశ్ (2023): 'లాడ్లీ బెహనా' పథకం కింద 13.1 మిలియన్ల మహిళలకు నెలకు ₹1,250; దీనివలన అధికారం నిలబెట్టుకోగలిగింది అధికార పార్టీ.
  • కర్నాటక (2023): 'గృహ లక్ష్మి' పథకం (రూ. 2000/నెలకు) కాంగ్రెస్ గెలుపుకు సహాయపడింది.
  • ఒడిశా (2024): 'సుభద్ర' పథకంతో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది.
  • మహారాష్ట్ర (2024): 'లడ్కీ బెహెన్' పథకం (రూ. 1500/నెలకు), పెద్ద మహిళా ఓట్ బేస్ గా నిలిచింది.
  • జార్ఖండ్ (2024): "మైయా సమ్మాన్" పథకం ఎన్నికల ప్రభావం. హేమంత్ సోరెన్ తిరిగి వచ్చారు.

ఇదే కాకుండా చాలా 'ఉచిత' పథకాలు ..

తమిళనాడులో 2.2 కోట్ల మంది రేషన్ కార్డుదారులు ఉచిత రిఫ్రిజిరేటర్లు, విద్యా రుణమాఫీలు, సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను ఇస్తున్నాయి పార్టీలు. కేరళలో ఇప్పుడు 62 లక్షల మంది సంక్షేమ పింఛను పథకంలో నమోదు చేసుకున్నారు. పింఛన్లను కూడా ₹600 నుండి ₹2,000 వరకు పెంచారు. బెంగాల్‌లో నిరుద్యోగ యువత పింఛన్ల కోసం ₹1,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Tags:    

Similar News