Puducherry CM Rangasamy: సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్
Puducherry CM Rangasamy: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంది.
రంగస్వామి File Photo
Puducherry CM Rangasamy: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు ఎవరికి వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా చాలా మంది సీనియర్ రాజకీయనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రాష్ట్రానికి చెందిన సీఎం కరోనా బారిన పడ్డారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన ఆదివారం ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో ఆయనకి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రంగస్వామి ఆరోగ్యం నిలకడగా ఉందిని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. రంగస్వామి నాలుగు రోజుల క్రితం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే పుదుచ్చేరికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.