లండన్ తరహాలో ప్రజా రవాణా వ్యవస్థ.. కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు

కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నితిన్‌ గడ్కరీ పరిశ్రమ వర్గాలకు సూచించారు.

Update: 2020-05-06 14:34 GMT
Nitin Gadkari (File Photo)

కరోనా వ్యాప్తి కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నితిన్‌ గడ్కరీ పరిశ్రమ వర్గాలకు సూచించారు. లాక్ డౌన్ తర్వాత త్వరలో ప్రజా రవాణా కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దానికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. బస్సు, కార్ల ఆపరేటర్ల కాన్ఫెడరేషన్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన నితిన్ గడ్కరీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.

ఈ సందర్భగా ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది. గైడ్ లైన్స్ విడుదల చేస్తామని అన్నారు. బస్సులు, కార్లలో కూడా మాస్క్‌లు, శాటిటైజర్లు, హ్యాండ్ వాష్, ఇతరత్రా తప్పనిసరిగా అమలు చేసే విధంగా ఉండాలన్నారు. ప్రజా రవాణా, హైవేలు ఓపెన్ చేసిన తర్వాత కూడా ప్రజల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా ఉండాలని సూచించారు. లండన్ తరహాలో ప్రజా రవాణా వ్యవస్థను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని నితిన్ గడ్కరీ చెప్పారు. లండన్ ప్రజారవాణాలో ప్రభుత్వ భాగస్వామ్యం తక్కువ, ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. భారతీయ ట్రక్ బాడీ నాణ్యత మీద కూడా మంత్రి స్పందించారు.

కాగా.. ప్రజారవాణా రంగానికి బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించాలని కోరగా.. వారి సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. లాక్ డౌన్ వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రి మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని గడ్కరీ చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రచించాలని సూచించారు.


Tags:    

Similar News