ఉచిత హామీలు తీవ్రమైన ఆర్థిక సమస్యకు దారి తీస్తాయి: సీజేఐ

Supreme Court on Freebies: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2022-08-03 14:45 GMT

ఉచిత హామీలు తీవ్రమైన ఆర్థిక సమస్యకు దారి తీస్తాయి: సీజేఐ

Supreme Court on Freebies: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలు తీవ్రమైన ఆర్థిక సమస్యకు దారితీస్తాయని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దీనిని పరిశీలించేందుకు ఒక అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు సూచనలు కోరారు. ఏడు రోజుల్లోగా అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు. తదుపరి విచారణ ఆగస్టు 8కి వాయిదా వేశారు.

ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ బీజేపీ సభ్యుడు, అడ్వొకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది, సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా దీనిని సమర్థించారు. ఉచిత హామీలతో ఆర్థిక సంక్షోభం ఏర్పడొచ్చని ఆయన అన్నారు. మరోవైపు పార్లమెంటులో దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్​ నాయకుడు, సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​ వాదించగా ఏ రాజకీయ పార్టీ అలా చేయదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News