Priyanka Gandhi: తప్పుడు వాగ్దానాలు, అవినీతిని తిప్పికొట్టాలి..
Priyanka Gandhi: తప్పుడు వాగ్దానాలను, అవినీతిని ఈ ఎన్నికల్లో తిప్పి కొట్టాలని కేరళ ఓటర్లకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.
Priyanka Gandhi: తప్పుడు వాగ్దానాలు, అవినీతిని తిప్పికొట్టాలి..
Priyanka Gandhi: తప్పుడు వాగ్దానాలను, అవినీతిని ఈ ఎన్నికల్లో తిప్పి కొట్టాలని కేరళ ఓటర్లకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం కేరళలోని కొల్లాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు వాగ్దానాలు చేసేవారికి, అవినీతి ప్రభుత్వానికి ఓట్లేయరని అనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతున్నారని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో దేశ ప్రజలకు కనీస రవాణా సౌకర్యం కల్పించలేకపోయారని మోడీ సర్కార్‌పై మండిపడ్డారు ప్రియాంక గాంధీ.