లాక్ డౌన్ పొడిగించాలి.. ఆయా రాష్ట్రాల సీఎంల వినతి
లాక్ డౌన్ మరో ఐదు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లాక్ డౌన్ మరో ఐదు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో తదుపరి వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామని తెలిపారు. కరోనా మహమ్మరిని ఎదుర్కొనడంలో రాష్ట్రలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. లాక్‌డౌన్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులిచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడడం అతిపెద్ద సవాలని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆరు గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈరోజు రాత్రి 9.30గంటల వరకూ ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సాయంత్రం ఆరు గంటల సమయంలో 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు.ఈ సమావేశంలో పలు రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని ప్రధాని
నరేంద్రమోదీని కోరారు. క్‌డౌన్ పొడిగించమని కోరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణలు ఉన్నాయని తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించ వద్దుని కోరారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ సాద్యపడదని, ఇప్పుడే కరోనా వదలి పోదని అన్నారు.