నేటి నుంచి యూరప్ టూర్ కు ప్రధాని మోడీ

Narendra Modi: మూడు రోజుల పాటు డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీలో పర్యటన

Update: 2022-05-02 01:02 GMT

నేటి నుంచి యూరప్ టూర్ కు ప్రధాని మోడీ

Narendra Modi: ప్రధాని మోడీ ఇవాళ యూరప్‌ పర్యటనకు వెళ్తున్నారు. డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మోడీ హాజరుకానున్నారు. కరోనా విజృంభణ తరువాత రెండేళ్లలో తొలిసారి విదేశాల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి మూడు రోజుల ఫారెన్‌ టూర్‌ ప్రారంభమవుతుంది. ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్దం జరుగుతున్న వేళ మోదీ యూరప్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని.. తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్‌ చేరుకుంటారు. మూడు దేశాల్లో దాదాపు 65గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ గడపనున్నారు.

ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశం అవుతారు మోడీ. యూరప్‌ పర్యటనలో 25 సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. పలువురు ప్రపంచ నేతల భేటీలో ద్వైపాక్షిక, అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తోనూ మోడీ చర్చలు జరపనున్నారు. 'జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌తో బెర్లిన్‌లో మోడీ భేటీ అవుతారు. షోల్స్‌తో మోడీ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్‌ నిర్వహిస్తున్న సదస్సులోనూ మోడీ పాల్గొంటారు.

Tags:    

Similar News