Narendra Modi: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ
Narendra Modi: కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
Narendra Modi: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ
Narendra Modi: ప్రజల ఆస్తులను దోచుకోవడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రజల ఆస్తులపై దృష్టి పెట్టాయని, వారు అధికారంలోకి రాగానే ఉన్నదంతా లాక్కుంటారని వ్యాఖ్యానించారు. అలీఘర్ ప్రజలు బుజ్జగింపులు, బంధుప్రీతి, అవినీతికి తాళాలు వేశారని కొనియాడారు. మొదట్లో ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడేవారు. అయోధ్య, కాశీనీ వదలలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఫుల్ స్టాప్ పడిందని మోడీ చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్రంలో అల్లర్లు, హత్యలు, గ్యాంగ్ వార్‌లను ప్రోత్సహించిందని మోడీ ఆరోపించారు.