పుల్వామా అమరసైనికులకు పలువురి నివాళులలు

Update: 2021-02-14 05:15 GMT

Prime Minister Modi Tribute To Pulwama Martyrs

పుల్వామా ఉగ్రదాడిని దేశం మరోసారి గుర్తు చేసుకుంటుంది. అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటుంది. దేశ రక్షణ, భద్రతలో తమ ప్రాణాలను వదిలిన సైనికులకు సెల్యూట్‌ చేస్తుంది. పుల్వామా ఘటన జరిగి రెండేళ్లు నిండిన సందర్భంగా అమరసైనికులకు పలువురునివాళులర్పించారు. వారు చేసిన త్యాగాలను కొనియాడారు.

రెండేళ్ల కిందట జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనికులు ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌కి చెందిన 40 మంది సైనికులు అమరులయ్యారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. 78 వాహనాల్లో 2500 మంది సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. పాకిస్థాన్‌కు మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదాను భారత్‌ ఉపసంహరించింది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీంతో గుణపాఠం చెప్పేందుకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ చేసింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించగా.. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

Tags:    

Similar News