మాజీ ప్రధాని వాజ్ పేయికి రాష్ట్రపతి.. ప్రధాని నివాళి

Delhi: అనంతరం సంగీత కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

Update: 2023-08-16 04:19 GMT

మాజీ ప్రధాని వాజ్ పేయికి రాష్ట్రపతి.. ప్రధాని నివాళి

Delhi: భారత రాజకీయాల్లో తనకుంటూ చెరగని ముద్రవేసుకున్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లిలోని స్మాకర స్థలం సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్రమంత్రులు మాజీ ప్రధాని సమాధి వద్ద పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. బీజేపీ సీనియర్ నేతలు వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సంగీత కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.

Tags:    

Similar News