Droupadi Murmu: కోల్‌కతా ఘటనపై రాష్ట్రపతి ముర్ము ఆందోళన వ్యక్తం
Droupadi Murmu: మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి
Droupadi Murmu
Droupadi Murmu: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదో భయానక ఘటన అని, తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కోరారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజమూ అనుమతించదని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.