Droupadi Murmu: రేపు శబరిమల ఆలయాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: కేరళలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Droupadi Murmu: కేరళలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపు శబరిమల ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకుంటారు. ఎల్లుండి తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతి కే.ఆర్.నారాయణ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు.శ్రీ నారాయణ గురు సమాధి శతాబ్ది ఉత్సవాలకు ముర్ము హాజరవుతారు. సెయింట్ థామస్ కాలేజ్, ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు.