Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీ మరణించినప్పుడు మీరేం చేశారు.. కాంగ్రెస్ పై ప్రణబ్ కూతురు తీవ్ర ఆరోపణలు

Sharmistha Mukherjee: భారత దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-28 11:26 GMT

Sharmistha Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీ మరణించినప్పుడు మీరేం చేశారు.. కాంగ్రెస్ పై ప్రణబ్ కూతురు తీవ్ర ఆరోపణలు

Sharmistha Mukherjee: భారత దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేకపోయారని ఆమె విమర్శించారు. ఇదేంటని అడిగితే రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత తనకు చెప్పారని శర్మిష్ట గుర్తు చేశారు.

కానీ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారని.. ఆ సంతాప సందేశాన్ని రాసింది కూడా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీనే.. ఈ విషయం ఆయన డైరీ ద్వారా తాను తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని శర్మిష్ట ఎక్స్ లో పోస్టు పెట్టారు.

మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం స్మారక స్తూపం ఏర్పాటుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరడాన్ని శర్మిష్ట సమర్థించారు. మన్మోహన్ సింగ్ కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన.. అందుకు ఆయన అర్హుడని ఆమె అన్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన తండ్రి మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.

ఇదిలా ఉండగా గురువారం అనారోగ్యంతో మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ అయిన సీడబ్ల్యూసీ.. మన్మోహన్ సింగ్ మరణానికి గౌరవార్ధంగా ప్రత్యేక తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే తన తండ్రి ప్రణబ్ ముఖర్జీకి సీడబ్ల్యూసీ సంతాపం తెలపకపోవడంపై శర్మిష్ట ఆగ్రహం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News