Prajwal Revanna: సెక్స్ స్కాండెల్ కేసులో ప్రజ్వల్ కస్టడీ పొడిగింపు
Prajwal Revanna: ఈ నెల 10 వరకు కస్టడీని పొడిగించిన ప్రత్యేక కోర్టు
Prajwal Revanna: సెక్స్ స్కాండెల్ కేసులో ప్రజ్వల్ కస్టడీ పొడిగింపు
Prajwal Revanna: సెక్స్ స్కాండెల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ఈ నెల 10 వరకు కస్టడీని బెంగళూరు కోర్టు పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు ప్రజ్వల్‌ను కోర్టులో హాజరుపరిచారు. మరింత సమాచారం ప్రజ్వల్ నుంచి రాబట్టాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. పూర్తి సమాచారం రేవణ్ణ నుంచి రాబట్టలేకపోయామని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జూన్ 10 వరకు కస్టడీకి ఇచ్చింది. సెక్స్ స్కాండెల్ కేసులో విదేశాల నుంచి మే 31న వచ్చిన ప్రజ్వల్‌ను సిట్ అధికారులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. నాటి నుంచి రేవణ్ణ సిట్ అధికారుల కస్టడీలోనే ఉన్నారు.