Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
Droupadi Murmu: ఒడిశాలోని యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముర్ము
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తప్పని కరెంట్ కోతల తిప్పలు..
Droupadi Murmu: ఒడిశాలోని బరిపడలో మహరాజ శ్రీరామ్ చంద్ర భందేవ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా కరెంట్ పోయింది. దీంతో అక్కడంతా అంధకారం చోటుచేసుకుంది. మధ్యా హ్నం 11.56 నుంచి 12.05 గంటల వరకు తొమ్మిది నిముషాలు పాటు విద్యుత్తు లేకున్నా ఆమె డిమ్ లైట్‌లోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.