Priyanka Gandhi: ప్రియాంక గాంధీని అడ్డుకున్న యూపీ పోలీసులు
Priyanka Gandhi: ఆగ్రా పీఎస్‌లో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని.. పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీని అడ్డుకున్న యూపీ పోలీసులు (ఫైల్ ఇమేజ్)
Priyanka Gandhi: లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రా పీఎస్‌లో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక వెళ్తుండగా.. పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.