PM Narendra modi: సాయంత్రం జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. సర్వత్రా ఆసక్తి

PM Narendra modi: మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ..సాయింత్రం నాలుగు గంటలకు మోడీ ప్రసంగం మొదలుకానుంది

Update: 2020-06-30 09:03 GMT
Prime minister Modi (file photo)

PM Narendra modi: మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ..సాయింత్రం నాలుగు గంటలకు మోడీ ప్రసంగం మొదలుకానుంది. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మోదీ ఇప్పటి వరకు అయిదు సార్లు జాతినుద్దేశి ప్రసంగించారు. నిన్నటితో అన్ లాక్ డౌన్ 1.0 ముగియడంతో అన్ లాక్ డౌన్ 2.0 అంశాలపైన మోడీ మాట్లాడే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది..

ఇక నిన్న కొత్తగా మళ్లీ అన్ లాక్ డౌన్ 2.0 కి సంబంధంచిన నిబంధనలను కేంద్రం విడుదల చేసింది..దీని గురించి మోడీ మరింత స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక అటు దేశంలో కరోనా కేసుల పెరుగుతుండడం, కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ని పొడిగించడం వంటి అంశాలపై కూడా ప్రధాని మోడీ మాట్లాడనున్నారు..

ఇక చైనాతో సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. అంతేకాకుండా టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసిన నేపథ్యంలో మోడీ ప్రసగంపైన మరింత ఆసక్తి నెలకొంది.. గల్వాన్‌లోయ ఘటన తరువాత తొలిసారి దేశ ప్రజల ముందుకు వస్తున్న ప్రధాని.. చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించవచ్చని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి..

ఇక అటు భారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,522 కేసులు నమోదు కాగా, 418 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం 5,66,840 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2, 15,125 ఉండగా, 3,34,821 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,893 మంది కరోనా వ్యాధితో మరణించారు. 


Tags:    

Similar News