China apps banned in india: 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్!

China apps banned in india: భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ తో సహా 59 చైనా మొబైల్ యాప్స్ ని నిషేదిస్తున్నట్టుగా ప్రకటించింది.

Krishna
Updated on: 29 Jun 2020 10:53 PM IST
China apps banned in india: 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్!
X

China apps banned in india: భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ తో సహా 59 చైనా మొబైల్ యాప్స్ ని నిషేదిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇందులో టిక్ టాక్, యూసీ బ్రౌజర్ యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్ , హలో, లైక్, యూకామ్, మేకప్ , వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్ , కామ్ స్కానర్ , మొబైల్ లెజెండ్స్ , న్యూ వీడియో స్టేటస్ , ఫోటో వండర్ , వీ మీట్ లతో పాటుగా మొదలగు యాప్స్ ని బ్యాన్ చేస్తునట్టుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన లిస్టు ని విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

గత కొన్ని రోజుల ముందు ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. అయితే వారికి ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. గతంలోనూ పలువురు ఎంపీలు కూడా ఈ యాప్ లను నిషేధించాలని పార్లమెంట్ లో తమ గళం విప్పారు. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story