వార్నర్ అదరగొట్టాడు.. టీమిండియాలో నా ఫేవరేట్ క్రికెటర్ అతడే : మహేశ్

వార్నర్ అదరగొట్టాడు.. టీమిండియాలో నా ఫేవరేట్ క్రికెటర్ అతడే : మహేశ్
x
Highlights

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ టిక్‌టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ టిక్‌టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే.వార్నర్ తన సతీమణి క్యాండిస్‌తో కలిసి చిందేయగా ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఇక ఈ వీడియోను తీయడానికి తాము 56 సార్లు ప్రయత్నించామని వార్నర్ పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. ఆదివారం సాయంత్రం అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ నిర్వహించిన లైవ్ చాట్ ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. డేవిడ్ వార్నర్ మైండ్ బ్లాక్ సాంగ్ కి వార్నర్ అదరగొట్టాడని కితాబిచ్చాడు.

ఈ సందర్భంగా మహేశ్‌ను ఫేవరేట్ క్రికెటర్స్ ఎవరని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి మహేశ్ బదులిస్తూ.. మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ , విరాట్ కోహ్లీలని బదులిచ్చాడు. కానీ తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మాత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకొచ్చాడు మహేశ్. 'మహర్షి' మూవీ సక్సెస్ ఈవెంట్‌లో చాటుకున్నాడు. ఆ కార్యక్రమంలో మహేశ్ బాబు మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత నిర్మాత దిల్ రాజ్ సిక్సర్ అని చెప్పగానే తనకు 2011 ప్రపంచకప్‌లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ గుర్తుకొచ్చిందన్నాడు.

సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు కొత్త సినిమా అప్‌డేట్స్‌ ఇవ్వడం మహేశ్‌బాబు అనవాయితీ. ప్రస్తుతం గీతగోవిందం పరశురామ్‌ దర్శకత్వంలో చేయనున్న సినిమాకి 'సర్కారు వారి పాట' టైటిల్‌ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. నటీనటుల వివరాలు తెలియల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories