అంతర్జాతీయ స్థాయికి దేశీయ ఉత్పత్తి రంగం: మోడీ

Update: 2021-03-05 15:45 GMT

అంతర్జాతీయ స్థాయికి దేశీయ ఉత్పత్తి రంగం: మోడీ

దేశీయ తయారీ రంగాన్ని అన్ని రకాలుగానూ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి వేగంగా కృషి చేయాలన్నారు. తయారీ సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. దీని కోసమే తమ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందని వివరించారు మోడీ. శుక్రవారం జరిగిన వెబినార్‌లో మోడీ పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. గడచిన 6-7 సంవత్సరాల్లో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు విజయవంతంగా కృషి చేసినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్ రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశాన్ని మార్చుతుందని.. అనేక అంశాలతో సహజీవనం చేయగలిగే వ్యవస్థను సృష్టిస్తుందని చెప్పారు.

Tags:    

Similar News