PM Kisan Samman Nidhi Scheme: అన్నదాతకు కేంద్రం తీపికబురు..రైతుల ఎకౌంట్లలోకి 2 వేల రూపాయలు!

PM Kisan Samman Nidhi Scheme: రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను ముందుకు తీసుకువస్తోంది.

Update: 2020-07-09 15:00 GMT
pm kisan samman nidhi

PM Kisan Samman Nidhi Scheme: రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను ముందుకు తీసుకువస్తోంది. అందులో భాగంగానే గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.. ఇప్పటి వరకు ఈ పథకంలో 10 కోట్లకు పైగా రైతులు చేరగా, ఈ పథకం కింద కేంద్రం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6,000 అందిస్తోంది.

అయితే ఇప్పుడు ఆరో విడత డబ్బులు కూడా రైతుల అకౌంట్లలోకి త్వరలోనే రానున్నాయి. ఆగస్ట్ 1 నుంచి అన్నదాతలకు రూ.2,000 డబ్బులు అందనున్నాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని వారు ఎవరైనా ఉంటె సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరవచ్చు.. దీని కోసం మీ వద్ద మీ పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలు ఉంటే సరిపోతుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరే ఈ పథకంలో చేరవచ్చు!

ఇక అటు తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో రైతుల కోసం అగ్రిక్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను గ్రామాలకు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది. 


Tags:    

Similar News