కేంద్ర మంత్రివర్గంలో మార్పులు.. పీయూష్‌ కు పాసవాన్‌ శాఖలు!

Piyush Goyal Gets Additional Charge : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాంవిలాస్‌ పాసవాన్‌ అనారోగ్య సమస్యలతో నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే..

Update: 2020-10-09 08:54 GMT

piyush goyal

Piyush Goyal Gets Additional Charge : కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత రాంవిలాస్‌ పాసవాన్‌ అనారోగ్య సమస్యలతో నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.. ఆయన హఠాన్మరణంతో కేంద్రమంత్రి వర్గంలో మార్పులు జరిగాయి.. రాంవిలాస్‌ పాసవాన్‌ శాఖలను పీయూష్‌ గోయల్‌కు అప్పగించింది ప్రభుత్వం. ఇప్పటికే పీయూష్‌ గోయల్‌ రైల్వే పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆహారం, ప్రజా సరఫరా మంత్రిత్వశాఖ బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ప్రధాని మోదీ సలహా మేరకు పీయూష్‌ గోయల్‌కు అదనపు బాధ్యతలిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం వెల్లడించింది. కాగా ఆ శాఖలకి గాను త్వరలోనే మరో మంత్రిని కేటాయించే అవకాశం ఉంది.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంవిలాస్‌ పాసవాన్‌ నిన్న(గురువారం)రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇటివలే ఆయనకి గుండె సర్జరీ కూడా చేసుకున్నారు. ఆయన చనిపోయిన విషయాన్నీ అయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాంవిలాస్‌ పాసవాన్‌ దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు..అటు ప్రధాని మోడీ కూడా ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాశ్వాస్‌ నివాసానికి వెళ్లి ఆయన భౌతికగాయం వద్ద నివాళులు అర్పించారు. అలాగే అయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అయన అంత్యక్రియలు జరగనున్నాయి. 

Tags:    

Similar News