కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం
x
Chandrakantha goyal, piyush goyal(File photo)
Highlights

రైల్వే శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం కలిగింది.

రైల్వే శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు పీయూష్‌ గోయల్‌‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి చంద్రకాంత‌ గోయల్‌ మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా ఆమె తన నివాసంలో మరణించారు. తల్లి మరణ వార్తను పియూష్ గోయల్ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. తన తల్లి తన జీవితాంతం ప్రజల సేవ కోసం పని చేసిందని, ఇతరులను కూడా అదే విధంగా ఉండాలని చెప్పేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు శనివారం ఉదయం ఆమె దహన సంస్కారాలు జరిగినట్లు బిజెపి నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మంత్రి వినోద్ తవ్డే తెలిపారు.

ఎమర్జెన్సీ తరువాత చంద్రకాంత గోయల్ ముంబైలో కార్పొరేటర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.. అనంతరం ముంబైలోని మాతుంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిజెపికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె భర్త, దివంగత వేద్ ప్రకాష్ గోయల్ చాలా కాలం బిజెపి జాతీయ కోశాధికారిగా పనిచేయడమే కాకా.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో షిప్పింగ్ మంత్రిగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories