Navjot Singh Sidhu: సీఎం ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు..
Punjab Polls: ఎన్నికలకు పట్టుమని నెల్లాళ్లైనా లేని సమయంలో పంజాబ్ కాంగ్రెస్ కి సిద్దూ కొరకరాని కొయ్యగా తయారయ్యారు.
Navjot Singh Sidhu: సీఎం ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు..
Punjab Polls: ఎన్నికలకు పట్టుమని నెల్లాళ్లైనా లేని సమయంలో పంజాబ్ కాంగ్రెస్ కి సిద్దూ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. పార్టీకి తొలినుంచీ విధేయుడుగా ఉన్న అమరీందర్ సింగ్ తప్పుకున్నా కూడా సిద్దూ తన వాగ్ధాటిని, దూకుడు తనాన్ని ఏ మాత్రం తగ్గించలేదు. తాజాగా పార్టీ హైకమాండ్ పైనే దూకుడు వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ సీఎంని ఎన్నుకునేది సాక్షాత్తూ ప్రజలేనని, హై కమాండ్ కాదని బాహాటంగా కామెంట్ చేశారు. పార్టీ హైకమాండ్ సీఎంని నిర్ణయిస్తుందన్నది తప్పుడు మాట ప్రజలెన్నుకున్న నేతే సీఎం అవుతారనీ అన్నారు. తాజా పరిణామాలతో హైకమాండ్ ని మరోసారి ఇరకాటంలోకి నెట్టారు.