బస్సులో దంపతలిద్దరికీ కరోనా.. పరుగులు తీసిన ప్రయాణికులు

మనిషిని కలలో కూడా వెంటాడే పేరు కరోనా.. ఎవరైనా సరే కరోనా పేరు తలవందే రోజు గడవదు.

Update: 2020-06-23 15:00 GMT
Representational Image

మనిషిని కలలో కూడా వెంటాడే పేరు కరోనా.. ఎవరైనా సరే కరోనా పేరు తలవందే రోజు గడవదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మనిషిని అంతలా భయపెడుతుంది ఈ మహమ్మారి. ఎవరు మామూలుగా ఉన్నారో.. కోవిడ్ ను మోసుకొస్తున్నారో తెలియని అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొంది. తమిళనాడులో వెలుగుచూసిన ఓ ఘటన బస్సులోని తోటి ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. క‌రోనా సోకిన ఓ జంట ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి మిగ‌తా ప్ర‌యాణికుల గుండెల్లో ద‌డ పుట్టించారు.

త‌మిళ‌నాడులో క‌డ‌లూరు జిల్లాకు చెందిన దంపతులు క‌డ‌లూరు నుంచి నెయెవెల్లికి ఆర్టీసీ బ‌స్సులో బ‌య‌ల్దేరారు. కొంత దూరం రాగానే వారికి వైద్యాధికారుల నుంచి ఫోన్ వ‌చ్చింది. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిందని వారికి తెలిపారు. బ‌స్సు ప్ర‌యాణం కంటే ముందు రోజే దంపతులు క‌రోనా టెస్టులు నిమిత్తం ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చినట్టు తెలిసింది. వారికి కరోనా ఉన్న మిగ‌తా ప్ర‌యాణికులంద‌రూ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. బ‌స్సు దిగి పరుగులు పెట్టారు. క‌రోనా సోకిన వారిని అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత బ‌స్సును పూర్తిగా శానిటైజ్ చేశారు. దంపతులు ఇద్దరూ బస్సులో ప్రయాణించి ప్రయాణికులను అధికారులను ఇబ్బంది పెట్టారు.


Tags:    

Similar News