Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
Budget 2023: కాసేపట్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర వార్షిక బడ్జెట్
Budget 2023: బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
Budget 2023: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్‍కు వేళైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్‍సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వం తీసుకువస్తున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీంతో ఈసారి ఆర్థిక పద్దుపై మరింత ఆసక్తి, ఆకాంక్షలు నెలకొన్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‍పై మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగుల నుంచి పరిశ్రమలు, కార్పొరేట్ల వరకు అనేక రంగాలు, వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను మినహాయింపు పెంపు కోసం వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు వేచిచూస్తున్నారు.