Pakistan vs India War: మోగిన యుద్ధ సైరన్? ఏ క్షణమైనా దాడి!
Pakistan vs India War: ఒకవేళ ఈ ఉద్రిక్తతలు యుద్ధంగా మారితే.. పాకిస్థాన్‌కు ఎదురయ్యే దెబ్బలు తట్టుకోలేనివే.
Pakistan vs India War: మోగిన యుద్ధ సైరన్? ఏ క్షణమైనా దాడి!
Pakistan vs India War: ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియదు కానీ.. సరిహద్దుల్లో పరిస్థితులు ఇప్పుడు సమరముఖం వైపు దూసుకెళ్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఓనమాలు మానేయకూడదన్న ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. పాక్ కూడా ఏ సమయంలో అయినా భారత దళాల ప్రతీకార దాడికి గురవుతామన్న భయంతో నిద్రలేకుండా ఉంది. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఒక్కటే – యుద్ధం జరిగితే ఎవరిది గెలుపు? ఎవరిది మేలైన సైనిక, ఆర్థిక బలం?
భారత్ ప్రస్తుతం సైనికంగా దాదాపు ఆసియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనూ ప్రముఖ శక్తిగా నిలిచింది. 60 లక్షల శిక్షణ పొందిన సైనికులు, 5,137 యుద్ధ విమానాలు, 295 యుద్ధ నౌకలు, 172 అణ్వాయుధాలతో భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తిమంతంగా మారింది. ఇక 2025కి భారత రక్షణ బడ్జెట్ 8000 కోట్ల డాలర్లకు చేరింది. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. వారి సైనిక బలం 17 లక్షలు, విమానాలు 2,074, యుద్ధ నౌకలు పరిమితమే. అణ్వాయుధాల పరంగా 170 ఉన్నా, వాటిని ఉపయోగించే మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక దృష్టి లోపించడంతో అవి అంతగా ప్రభావం చూపే అవకాశములేదు.
ప్రపంచ మద్దతు కూడా ఇప్పుడు భారత్ వైపే ఉంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలు పహల్గాం దాడిని ఖండించి భారత్‌కు బాసటగా నిలిచాయి. పాక్ అయితే అంతర్జాతీయంగా ఒంటరిపడిపోయింది. చైనా నుంచి తాము పొందిన PL-15 క్షిపణులు ఉన్నా, వాటి శక్తి భారత్ రక్షణ వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేయగలవని చెప్పలేము.
ఆర్థికంగా చూస్తే 2025లో భారత్ జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లు అయితే పాక్‌ది కేవలం 348.72 బిలియన్ డాలర్లే. అంటే భారత ఆర్థిక శక్తికి ఇది పదో వంతుకూడా కాదు. విదేశీ మారక నిల్వలు భారత్ వద్ద 686.2 బిలియన్ డాలర్లు ఉండగా.. పాక్ వద్ద కేవలం 16.04 బిలియన్లే. పాక్‌లో ఇప్పటికే ధరలు భగ్గుమంటున్నాయి, ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంది. ఇక భారత్ ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, పాకిస్థాన్ వ్యవసాయ రంగం.. అంటే వారి జీడీపీలో 24 శాతం.. పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
మొత్తం మీద చూసుకుంటే.. పాక్ తీసుకున్న మార్గం తానే తవ్వుకున్న కందకంలా మారింది. పహల్గాం దాడితో దేశవ్యాప్తంగా కలిగిన ఆవేదన భారత్‌ను శక్తిమంతమైన చర్యలు తీసుకునే దిశగా నడిపిస్తోంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు యుద్ధంగా మారితే.. పాకిస్థాన్‌కు ఎదురయ్యే దెబ్బలు తట్టుకోలేనివే. అన్ని రంగాల్లోనూ పాక్‌ను మించిపోయి ముందంజలో ఉన్నా సంగతి స్పష్టమే.