POK: నెహ్రూ పొరపాటు చేశారా? లేదా బీజేపీ తప్పు చేసిందా? ఎవరి వాదన కరెక్ట్?

POK: ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి ప్రతీకార సూచనలు ఎక్కువవుతున్నాయి. సరిహద్దు వద్ద భారత ఆర్మీ కదలికలు, మదరసాల మూతపడటం, పాక్‌లో టెర్రర్ క్యాంపుల ఖాళీ కావడం వంటి పరిణామాలు చూస్తే, ఈసారి ప్రతీకారం ప్రారంభం ఎక్కడనుంచో స్పష్టమవుతోంది.

Update: 2025-05-03 02:30 GMT

POK: నెహ్రూ పొరపాటు చేశారా? లేదా బీజేపీ తప్పు చేసిందా? ఎవరి వాదన కరెక్ట్?

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉత్పత్తి అయిన విధానం తెలుసుకోవాలంటే, మనం 1947కి వెళ్లాల్సిందే. అదే సంవత్సరం భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆ సమయంలో జమ్ముకశ్మీర్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అక్కడ హరిసింగ్ అనే మహారాజా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఆయన తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే పూంచ్‌ ప్రాంతంలో రైతుల తిరుగుబాటు మొదలైపోయింది. ఈ పరిస్థితిని అవకాశంగా మలచుకున్న పాకిస్థాన్, అక్టోబర్ 1947లో భీకరంగా చొరబడింది.

పాక్ మద్దతుతో వచ్చిన పోరాట కారులు బారాముల్లా, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తన పరిపాలన కోల్పోతున్నానన్న భయంతో మహారాజా హరిసింగ్, భారత ప్రభుత్వాన్ని సహాయం కోరారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించేందుకు, జమ్ముకశ్మీర్‌ను భారత దేశంలో విలీనం చేయాలని షరతు పెట్టింది. ఈ ఒప్పందానికి హరిసింగ్ అంగీకరించి 'ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్'పై సంతకం చేశారు. దీని ప్రకారం కశ్మీర్‌కు ప్రత్యేక హోదా వచ్చింది. కానీ 2019 ఆగస్టు 5న బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేసింది.

ఆపై భారత ఆర్మీ రంగప్రవేశం చేసి పాక్‌ చొరబాటుదారులపై చర్యలు ప్రారంభించింది. యుద్ధంలో భారత సైన్యం కొంత భూభాగాన్ని తిరిగి పొందగలిగినప్పటికీ.. ఒక భాగం మాత్రం పాక్ చేతుల్లోనే మిగిలింది. అదే భాగాన్ని ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)గా పిలుస్తున్నారు. చట్టపరంగా ఆ భూమి భారత దేశానికే చెందుతుంది. కానీ పాకిస్థాన్ ఆక్రమణకు గురైనప్పటి నుంచి ఇది సరిహద్దు సమస్యగా కొనసాగుతోంది. ఇప్పుడు, పహల్గాం ఘటన దృష్టిలో పెట్టుకుంటే.. పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి ప్రతీకార సూచనలు ఎక్కువవుతున్నాయి. సరిహద్దు వద్ద భారత ఆర్మీ కదలికలు, మదరసాల మూతపడటం, పాక్‌లో టెర్రర్ క్యాంపుల ఖాళీ కావడం వంటి పరిణామాలు చూస్తే, ఈసారి ప్రతీకారం ప్రారంభం ఎక్కడనుంచో స్పష్టమవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు దృష్టిపెట్టాల్సిన ప్రధాన స్థలంగా మారిపోయింది.

Tags:    

Similar News