పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Padma Awards: మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు

Update: 2024-01-26 02:20 GMT

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Padma Awards: భారతదేశంలోని అత్యున్నత పౌరపురస్కారమైన పద్మా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. మొత్తం 34 మందికి ఈ పురస్కారాలను ప్రకటించిగా..అందులో ఐదుగురు తెలుగువాళ్లు ఉండటం గర్వకారణం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవీలను అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. ఇందులో మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిలను ఈ అవార్డులు వరించాయి.

కేంద్రప్రభుత్వం తనకు పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వీడియా విడుదల చేశారు. తనతో ప్రతినిమిషం నడిచే లాక్షలాది మంది అభిమానుల ప్రేమ కారణంగానే ఈ రోజు తాను ఈ స్థితిలో ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News