Oxygen shortage: ఆక్సిజన్‌ కొరతతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Oxygen shortage: దేశంలో ఏర్పడిన ప్రాణవాయిువు సంక్షోభం కోవిడ్‌ పేషెంట్ల ఉసురు తీస్తోంది.

Update: 2021-04-24 16:30 GMT

Oxygen shortage: ఆక్సిజన్‌ కొరతతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

Oxygen shortage: దేశంలో ఏర్పడిన ప్రాణవాయిువు సంక్షోభం కోవిడ్‌ పేషెంట్ల ఉసురు తీస్తోంది. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఆక్సిజన్ అందింది. ఆక్సిజన్ సరిపడా లేని కారణంగా ఆక్సిజన్ సరఫరా ఫ్లోను తగ్గించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఏర్పడిన ఆక్సిజన్ కొరత 22 మంది కరోనా రోగుల్ని బలి తీసుకుంది.

ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఢిల్లీని వేధిస్తోంది. సరిపడా ఆక్సిజన్ లేకపోవడంతో కోవిడ్‌ రోగులు అల్లాడిపోతున్నారు. రాజధానిలోని అన్ని ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో నిండపోయాయి. దీంతో ప్రాణవాయివు కొరత భయంకరంగా వేధిస్తోంది. రోగుల దీనావస్థ చూడలేక ఆసుపత్రి యాజమాన్యాలు దిక్కు తోచక తలలు పట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కారణంగా కొత్త రోగులను చేర్చుకోవడం లేదని సరోజ్‌ ఆస్పత్రి తేల్చి చెప్పింది. అంతేకాదు, ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. 

Tags:    

Similar News