దేశంలో 91 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు

భారతదేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 91 లక్షలు దాటిందని ఆరోగ్యశాఖ పేర్కొంది

Update: 2021-02-18 05:03 GMT

ప్రతీకాత్మక చిత్రం 

భారతదేశంలో కరోనా టీకా లబ్ధిదారుల సంఖ్య 91 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం నాటికి మొత్తం 91,86,756 మంది కరోనా వ్యాక్సిన్‌ పొందినట్లు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందని పేర్కొంది.

అమెరికా, బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమై 60 రోజులు దాటగా, భారత్‌ కేవలం 31 రోజుల్లోనే 90 లక్షల డోసుల మార్క్‌ దాటినట్లు స్పష్టం చేసింది. మార్చి నుంచి మొదలుకానున్న 50 ఏళ్లకు పైబడిన ప్రజలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రైవేట్‌ రంగ సంస్థలను భాగస్వాములను చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News