పశ్చిమ బెంగాల్ లో తెలుగు భాషకు అధికార హోదా

పశ్చిమ బెంగాల్ లో తెలుగు భాషకు అధికార హోదా కల్పించారు. ఈమేరకు క్యాబినెట్ నిర్ణయించింది.

Update: 2020-12-23 06:59 GMT

పశ్చిమ బెంగాల్ లో తెలుగు భాషకు అధికార హోదా కల్పించారు. ఈమేరకు క్యాబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ విద్యా శాఖా మంత్రి పార్థ ఛటర్జీ మీడియాకు చెప్పారు. తెలుగు భాషకు అధికార భాషా హోదా ఇవ్వడంపై మమతా బెనర్జీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టయింది. 

త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపదాయంలో మామాతా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పటి నుంచో అక్కడి తెలుగు ప్రజలు చేస్తున్న డిమాండ్ కు ఇప్పుడు మమతా బెనర్జీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, పశ్చిమ బెంగాల్ లో హిందీ, ఉర్దూ, నేపాలీ, గురుముఖి, ఒడియా వంటి భాషలకు ఎప్పటి నుంచో అధికార హోదా ఉంది. 

ఈ నిర్ణయంతో తెలుగు వారు అధికంగా నివసించే ఖరగ్ పూర్ లోని ప్రజల మద్దతు మమతా సాధించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మమత ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు. 

ఇదిలా ఉంటె తెలుగు భాషకు అధికార హోదా ఇవ్వడంతో బెంగాల్ లో తెలుగువారిని భయపరమైన మైనారిటీలుగా గుర్తించినట్టయింది. దీంతో ఈ నిర్ణయం పై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News