NVS Posts 2021: నవోదయ పోస్టుల హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేది ఖరారు..
NVS Posts 2021: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
NVS Posts 2021: నవోదయ పోస్టుల హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష తేది ఖరారు..
NVS Posts 2021: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. చాలామంది నిరుద్యోగులు ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఈ పరీక్షకి సంబంధించిన హాల్‌టికెట్లని నవోదయ విద్యాలయ సమితి (NVS) విడుదల చేసింది. అంతేకాదు పరీక్ష తేదీని కూడా ఖరారు చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-A), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్స్, స్టెనోగ్రాఫర్ (గ్రూప్ C), అనేక ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 12 నుంచి ఫిబ్రవరి 10 వరకు కొనసాగింది. ఇక ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన పరీక్ష మార్చి 9 నుంచి మార్చి 11 వరకు నిర్వహిస్తామని ప్రకటించించారు.
అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inను సందర్శించండి.
2. హోమ్‌పేజ్‌లో కనిపించే 'Link for downloading an E-admit card' అనే లింక్‌పై క్లిక్ చేయండి.
3. సంబంధిత వివరాలతో లాగిన్ అవండి.
4. వెంటనే స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ ఓపెన్ అవుతుంది.
5. డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ ఔట్ తీసుకుంటే సరిపోతుంది.