Earthquake: మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
Earthquake: మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కిం రాష్ట్రాల్లో ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించాయి. స్వల్ప ప్రకంపనలు అయినప్పటికీ ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.
Earthquake
Earthquake: మూడు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ఆందోళన రేకెత్తించాయి. మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కిం రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతాలలో ఇటీవల పదేపదే సంభవిస్తున్న భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మధ్యప్రదేశ్ లో..
ఈరోజు తెల్లవారుజామున 3.57 గంటలకు మధ్యప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.9 తీవ్రతతో నమోదైంది. తీవ్రత తక్కువ కావడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించేలేదు.
హర్యానాలో రెండుసార్లు..
మధ్యప్రదేశ్‌లో భూకంపం తర్వాత, ఉదయం 6.47 గంటలకు హర్యానాలో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో నమోదైంది. కొద్దిసేపటి తరువాత అక్కడ మరో భూకంపం సంభవించింది. సరిగ్గా ఉదయం 6.53 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది.
సిక్కింలో..
మధ్యప్రదేశ్, హర్యానాల తర్వాత సిక్కింలో కూడా భూకంపం సంభవించింది. అక్కడ సరిగ్గా ఉదయం 10.54 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. మధ్యప్రదేశ్, తీవ్రతతో ఇక్కడ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు.
మనదేశంలో భూకంపాలు అప్పుడప్పుడు వస్తుండడం సహజం. అయితే, ఈరోజు మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కింలలో ఒకే రోజున వరుసగా భూకంపాలు సంభవించడం ఆ ప్రాంత ప్రజలలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భూకమపాలకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.