బీహార్ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సిని అమలు చేయదని జెడి (యు) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పునరుద్ఘాటించారు. అలాగే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కొత్త ఫార్మాట్ దేశంలో గందరగోళాన్ని సృష్టిస్తుందని.. అందువల్ల 2011 నుండి వాడుకలో ఉన్న పాత ఫార్మాట్‌ను కేంద్రం కొనసాగించాలని సూచించారు. అలాగే ఎన్‌పిఆర్ అనేది 2011 నుండి ఉంది, ఇది కొత్త విషయం కాదు.. కానీ, కొత్త ఫార్మాట్‌లో మరిన్ని ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయని.. ఇవి దేశంలో గందరగోళాన్ని సృష్టించగలదు అని అన్నారు. అన్నే మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో మాట్లాడిన నితీష్.. ఇప్పుడు ఉన్నవారు ఎవరికీ తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ తెలియదు.. అందువల్ల కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌పిఆర్ యొక్క పాత విధానాన్నే కొనసాగాలని మేము సూచిస్తున్నామని అని అధికార ఎన్‌డిఎకు కీలక మిత్రపక్షమైన జెడి (యు) తెలిపింది.
అలాగే దేశవ్యాప్త నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) గురించి మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సి రాష్ట్రంలో అమలు చేయబడదని.. మేము ఇప్పటికే ఈ విషయంపై స్పష్టత ఇచ్చామన్నారు. సిఎఎకు సంబంధించినంతవరకు అయితే ఈ విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది.. ఎవరికైనా సమస్య ఉంటే, వారు దానిపై సుప్రీం కోర్టులో చర్చించవచ్చని సలహా ఇచ్చారు. కాగా పార్లమెంటు ఉభయ సభలలో చట్టం ఆమోదించడానికి ఓటు వేసిన పార్టీలలో జెడి (యు) ఒకటి.
ఇక జెడియు జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కూడా ఘాటుగా స్పందించారు నితీష్.. ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఫర్వాలేదు, వెళ్ళినా ఫర్వాలేదు అని వ్యాఖ్యానించారు. కిషోర్ వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారని చెప్పిన ఆయన.. 'నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను, అతను పార్టీలో కొనసాగాలని కోరుకుంటే పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణానికి కట్టుబడి ఉండాలి.. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రశాంత్ ను పార్టీలో చేర్చుకోవాలని నాకు చెప్పారు... ఆయన మనసులో ఏదో ఉండి ఉండాలి అని అన్నారు. 2018 లో, కిషోర్ ను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించాం , ఆయనను రాజకీయాల "భవిష్యత్తు"' అని పేర్కొన్నారు నితీష్.. ప్రశాంత్ పార్టీలో ఉండాలనుకుంటే ఉండొచ్చు బయలుదేరాలనుకుంటే వెళ్లొచ్చు అని వ్యాఖ్యానించారు నితీష్. కాగా నిశాష్ కుమార్ ను విమర్శిస్తూ సుశీల్ కుమార్ మోడీ వీడియోను ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో పార్టీలోనే ఉంటూ అధ్యక్షుడిని విమర్శించడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.