Gas Cylinder: ఎల్పీజీ వినియోగదారులకి అలర్ట్.. ఇప్పుడు QR కోడ్‌తో గ్యాస్ సిలిండర్..!
Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది.
Gas Cylinder: ఎల్పీజీ వినియోగదారులకి అలర్ట్.. ఇప్పుడు QR కోడ్‌తో గ్యాస్ సిలిండర్..!
Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఇప్పుడు సిలిండర్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుందని ప్రకటించింది. వాస్తవానికి దీని ఉద్దేశ్యం బ్లాక్ మార్కెటింగ్, గ్యాస్ సిలిండర్ల దొంగతనాలను అరికట్టడం. త్వరలో వచ్చే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)సిలిండర్లపై QR కోడ్ ఉంటుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఈ కోడ్ సిలిండర్ ఆధార్ కార్డ్ లాగా పని చేస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ల నియంత్రణకు ఇది దోహదపడుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇప్పుడు వినియోగదారులు ఎల్‌పిజి సిలిండర్‌లను ట్రాక్ చేయగలరని ఇది విప్లవాత్మకమైన మార్పు అని పూరీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సిలిండర్‌పై క్యూఆర్ కోడ్ అతికిస్తారు. అయితే కొత్త సిలిండర్లపై ఇది ఇప్పటికే ఉంది.
మొదటి విడతలో 20,000 ఎల్‌పిజి సిలిండర్లలో క్యూఆర్ కోడ్‌లను అమర్చారు. QR కోడ్ అనేది ఏదైనా డిజిటల్ పరికరం సహాయంతో సులభంగా చదవగలిగే బార్‌కోడ్ రకం. వచ్చే మూడు నెలల్లో అన్ని 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్లు క్యూఆర్ కోడ్‌తో వస్తాయి. అయితే అన్ని పాత ఎల్‌పిజి సిలిండర్‌లపై ప్రత్యేక స్టిక్కర్‌ను ఏర్పాటు చేస్తారు.