Indian Railway: ప్రయాణికులకి గమనిక.. రైలులో ప్రయాణించేటప్పుడు ఈ నియమాలు ఎంతమందికి తెలుసు..!

Indian Railway: రైలులో ప్రయాణించేవారు కొన్ని నియమాలని తెలుసుకొని ఉండాలి.

Update: 2022-05-08 07:59 GMT

Indian Railway: ప్రయాణికులకి గమనిక.. రైలులో ప్రయాణించేటప్పుడు ఈ నియమాలు ఎంతమందికి తెలుసు..!

Indian Railway: రైలులో ప్రయాణించేవారు కొన్ని నియమాలని తెలుసుకొని ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే బెర్త్‌కు సంబంధించి అనేక నియమాలను రూపొందించింది. దాదాపు ఎక్కువ సార్లు మిడిల్ బెర్త్‌పై పడుకోవడంపై ప్రయాణికుల మధ్య వివాదం నెలకొంటుంది. ఈ పరిస్థితిలో మీరు ప్రయాణించేటప్పుడు ఏ నియమాలను పాటించాలో తెలుసుకుందాం.

ప్రయాణ సమయంలో ప్రజలు తరచుగా మిడిల్ బెర్త్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపరు. ఎందుకంటే చాలా సార్లు దిగువ బెర్త్‌లోని ప్రయాణీకులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. దీనివల్ల మిడిల్ బెర్త్‌తో ప్రయాణీకులకు సమస్యలు ఎదురవుతాయి. ఇది కాకుండా చాలాసార్లు మిడిల్ బెర్త్ ప్రయాణికులు బెర్త్‌ను ఓపెన్‌ చేయడం వల్ల దిగువ బెర్త్‌పై కూర్చున్న ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఈ పరిస్థితిలో మీరు బెర్త్‌కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది.

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణీకుడు తన బెర్త్‌ను రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచి ఉంచి పడుకోవచ్చు. ఒకవేళ 10 గంటలలోపు ఓపెన్‌ చేస్తే లోయర్ బెర్త్ ప్యాసింజర్ అభ్యంతరం చెప్పవచ్చు. రైల్వే నిబంధనల గురించి తెలియజేసి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణీకుడు లేచి కూర్చోవాలి. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత TTE మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. రైల్వే నిబంధనల ప్రకారం టీటీఈ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే టిక్కెట్లను తనిఖీ చేస్తాడు. అయితే రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణం ప్రారంభించిన ప్రయాణికులకు ఈ నిబంధన వర్తించదు.

Tags:    

Similar News