హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నోక్ విమాన సేవలు

* తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన విమానయానం

Update: 2023-02-23 05:49 GMT

హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు నోక్ విమాన సేవలు

Nok Air: జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం ఉదయమే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ విమానం బయల్దేరి వెళ్లింది. వారానికి మూడుసార్లు ఈ విమాన సర్వీసులను నడుపనున్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి రాత్రి 23.45 గంటలకు చేరుకుని తిరుగు ప్రయాణంలో 00.45 గంటలకు బయల్దేరనుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడారు. దేశంలో నోక్ ఎయిర్ సర్వీసులు మొదటగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Tags:    

Similar News