ముందస్తు బెయిల్ కు కాలపరిమితి లేదు: సుప్రీంకోర్టు

ముందస్తు బెయిల్ మంజూరు కు ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేమని, విచారణ ముగిసే వరకు ముందస్తు బెయిల్ ను కొనసాగవచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది.

Update: 2020-01-29 06:57 GMT

ముందస్తు బెయిల్ మంజూరు కు ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేమని, విచారణ ముగిసే వరకు ముందస్తు బెయిల్ ను కొనసాగవచ్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, న్యాయస్థానం క్రిమినల్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి) లోని సెక్షన్ 438 ప్రకారం తగిన షరతులతో ముందస్తు బెయిల్‌ను పొడిగించవచ్చని తెలిపింది.

జస్టిస్ ఇందిరా బెనర్జీ, వినీత్ సరన్ , ఎంఆర్ షా, రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌ను ఒక నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలా అనే విషయంపై విచారణ జరుపుతోంది. కాగా నేరారోపణలు మోపబడ్డ వ్యక్తులు ముందస్తుగా బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని కేసుల్లో నేరం రుజువు కాకపోయినా సంవత్సరాల తరబడి వారిని జైళ్లలో ఉంచుతున్నారు. దీనికి సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణాన్ని చూపించేవారు. నేరారోపణను తొలగించుకునేందుకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తుంది కోర్ట్. అయితే దీనికి కాలపరిమితి అంటూ ఏమి లేదని తాజాగా తీర్పు ఇచ్చింది. 

Tags:    

Similar News