Arvind Kejriwal: సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Arvind Kejriwal: పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Arvind Kejriwal: ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఏప్రిల్ 29 తర్వాత కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మరో వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.
ఈడీ రిప్లయ్ తర్వాత కేసును విచారించనుంది ధర్మాసనం. కాగా ఏప్రిల్ 24న సుప్రీంకోర్టుకు ఈడీ రిప్లయ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు సైతం సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. మరో 15 రోజులు జైల్లోనే ఉండనున్నారు సీఎం కేజ్రీవాల్.