పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు రద్దు.. ఇకనుంచి..

కరోనావైరస్ సంక్షోభం నీడలో సెప్టెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు..

Update: 2020-09-03 01:50 GMT

కరోనావైరస్ సంక్షోభం నీడలో సెప్టెంబర్ 14 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్‌ బిజినెస్‌ను రద్దు చేస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా బులెటిన్లు వెల్లడించాయి. ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరితో సహా ప్రతిపక్ష నాయకులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు క్వశ్చన్‌ అవర్‌ తొలగించవద్దని లేఖ రాశారు. పార్లమెంటులో 15 రోజుల ముందుగానే ఎంపీలు సభలో అడిగే ప్రశ్నలను సమర్పించాల్సిన ఉంటుంది. కానీ ఈ సెషన్ సెప్టెంబర్ 14 నుండి మొదలవుతుంది. కాబట్టి ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోతారు. మరోవైపు సమావేశాల్లో ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

బీఏసీలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని చర్చిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. కాగా ఈ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరు షిఫ్టుల్లో పనిచేస్తాయి.. సభ్యునికి సభ్యునికి మధ్య దూరం ఉండేలా ఎంపీల కోసం ప్రత్యేక సీటింగ్ ఉంటుంది. లోక్‌సభ మొదటి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది, ఆ తరువాత అక్టోబర్ 1 వరకూ మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. అలాగే రాజ్యసభ మొదటి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు, మిగిలిన రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. వారాంతాలు కూడా సమావేశాలు జరుగుతాయి. 

Tags:    

Similar News