ఇవే నా చివరి ఎన్నికలు.. ఇకపై రిటైర్ అవుతా : నితీష్ కుమార్

బిహార్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. ఎత్తుకు పై ఎత్తులు.. మాటకు మాటలతో చిన్న సైజు యుద్ధాన్ని తలపిస్తోంది పరిస్థితి అక్కడ ! మూడో విడత ప్రచారానికి ఇవాళ చివరిరోజు కావడంతో.. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించారు.

Update: 2020-11-05 16:21 GMT

బిహార్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. ఎత్తుకు పై ఎత్తులు.. మాటకు మాటలతో చిన్న సైజు యుద్ధాన్ని తలపిస్తోంది పరిస్థితి అక్కడ ! మూడో విడత ప్రచారానికి ఇవాళ చివరిరోజు కావడంతో.. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించారు. ఒక్క చాన్స్ అని తేజస్వీయాదవ్ అంటే.. జేడీయూ మీద గుర్రుగా ఉన్న చిరాగ్ పాశ్వాన్.. సంచలన ఆరోపణలు చేశారు. ఇక అటు జంగిల్ రాజ్ కుమారుడు అంటూ బీజేపీ నేతలు కూడా మాటల హీట్ పెంచారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎలక్షన్స్ అని... ఇక రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే నితీష్ వాఖ్యాల పట్ల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు.. వారు ఎన్నికల్లో ఓడిపోతారని ముందే ఉహించి అలాంటి వ్యాఖ్యలు చేశారని ఎద్దావా చేశారు.. తాము ముందు నుంచి ఇదే విషయాన్నీ చెబుతున్నామని, నేడు వారే ఆ విషయాన్ని గ్రహించారని విమర్శించారు.. బీహార్ ని తామే అభివృద్ధి పధంలో నడుపుతామని తేజస్వీ అన్నారు..

బిహార్‌లో ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరగగా... ఎల్లుండి మూడో విడత ఎలక్షన్స్ జరగనున్నాయ్. దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అధికారాన్ని నిర్ణయించే దశ కావడంతో.. బిహార్‌లో టెన్షన్ వాతావరణ కనిపిస్తోంది. ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయ్. 

Tags:    

Similar News