టెస్లాను స్వాగతిస్తామన్న నితిన్‌ గడ్కరీ.. కానీ ఒక షరతు..

Tesla In India: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల వివాదంపై కేంద్ర రవాణా శాఖమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-04-26 14:00 GMT

టెస్లాను స్వాగతిస్తామన్న నితిన్‌ గడ్కరీ.. కానీ ఒక షరతు..

Tesla In India: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల వివాదంపై కేంద్ర రవాణా శాఖమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ వాణిజ్య విఫణిలోకి టెస్లాను ఆహ్వానిస్తామని అయితే చైనా నుంచి దిగుమతి చేసే కార్లకు అనుమతి ఇవ్వలేమని మరోసారి గడ్కరీ స్పష్టం చేశారు. చైనాలో తయారుచేసి భారత్‌లో అమ్మకాలు చేయడమనేది సరైన పద్ధతి కాదన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. స్థానికంగా కార్లను తయారుచేస్తే ఎందరికో ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా లభిస్తుందని గడ్కరీ క్లియర్‌ కట్‌గా చెప్పారు. విస్తారమైన మార్కెట్‌ కలిగిన భారత్‌లో ప్రవేశించేందుకు టెస్లా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది,. 2019 జనవరిలోనే ఎలక్ట్రిక్‌ కార్లను భారత్‌లోకి తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ భావించారు. అయితే మూడేళ్లయినా అది సాధ్యపడలేదు.

మేక్‌ ఇన్‌ ఇండియా నినాదానికి వ్యతిరేకంగా విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇక్కడ విక్రయిస్తామని ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదించారు. ఆ తరువాతే తయారీ యూనిట్‌ను నెలకోల్పుతామని షరతు పెట్టారు. దీంతో పాటు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాన్‌ మస్క్‌ కోరారు. పలుమార్లు ప్రభుత్వం, టెస్లా మధ్య చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీరుకారణంగానే టెస్లా రావడం ఆలస్యమవుతోందంటూ ఆ మధ్య మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని మస్క్‌ ప్రయత్నిస్తున్నాడని.. ఇలాంటి ట్రిక్స్‌కు ప్రభుత్వం ఎన్నడూ తలొగ్గదని కేంద్ర స్పష్టం చేసింది. 

Tags:    

Similar News