CAFE Norms : కార్ల సైజును బట్టి కొత్త రూల్స్.. కాలుష్యం కట్టడికి ప్రభుత్వం కొత్త ప్లాన్!
మన దేశంలో కార్ల వల్ల పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, అలాగే వాటి ఫ్యూయల్ ఎఫిషియెన్సీని పెంచడానికి భారత ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌తో వస్తోంది. అదే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (CAFE) నార్మ్స్ మూడో వెర్షన్.
CAFE Norms : కార్ల సైజును బట్టి కొత్త రూల్స్.. కాలుష్యం కట్టడికి ప్రభుత్వం కొత్త ప్లాన్!
CAFE Norms : మన దేశంలో కార్ల వల్ల పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, అలాగే వాటి ఫ్యూయల్ ఎఫిషియెన్సీని పెంచడానికి భారత ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌తో వస్తోంది. అదే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (CAFE) నార్మ్స్ మూడో వెర్షన్. ఈ కొత్త రూల్స్ 2027 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావచ్చని అంటున్నారు. ఈసారి ప్రభుత్వం ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తోంది. అదేంటంటే, కార్ల సైజును బట్టి కాలుష్య నిబంధనలు మారబోతున్నాయి.
ఇప్పటిదాకా CAFE నార్మ్స్ అంటే, ఒక కార్ల కంపెనీ తయారు చేసే అన్ని మోడల్స్ కు కలిపి ఒకే రూల్ ఉండేది. ఉదాహరణకు, ఒక కంపెనీ చిన్న కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తూ, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తే, ఆ కంపెనీ పెద్ద ఎస్‌యూవీ (SUV) కార్లు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసినా పెద్ద సమస్య ఉండేది కాదు. అంటే, చిన్న కార్ల కాలుష్యంతో పెద్ద కార్ల కాలుష్యం బ్యాలెన్స్ అయ్యేది.
కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ ఫార్ములాను మార్చాలని ఆలోచిస్తోంది. ఇటీవల జూన్ 17న పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కార్ల కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన మీటింగ్ లో దీని గురించి చర్చించారు. కార్ల సైజును బట్టి కాలుష్య నిబంధనలు, ఫ్యూయల్ ఎఫిషియెన్సీ స్టాండర్డ్స్ వేర్వేరుగా పెట్టడంపై అభిప్రాయాలు చెప్పమని ప్రభుత్వం అడిగిందట.
సైజును బట్టి కొత్త రూల్స్ ఎలా ఉండొచ్చు?
ప్రభుత్వం ఇప్పుడు చిన్న కార్లకు, పెద్ద కార్లకు వేర్వేరు కాలుష్య లక్ష్యాలను ఎలా పెట్టాలి అనే దానిపై ఆలోచిస్తోంది. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి చివరి నిర్ణయం తీసుకోలేదు. ఈ వారం మరో మీటింగ్ కూడా ఉంది. దీనిపై చివరి నిర్ణయం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) తీసుకుంటుంది.
అధికారుల ప్రకారం.. పెద్ద, ఖరీదైన కార్లు కొనే వాళ్లపై కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేలా చేయొచ్చు. ఎందుకంటే వాళ్లు ఎక్కువ డబ్బు చెల్లించగలరు కదా. అలాగే, చిన్న కార్లను వాటి సైజు, ఇంజిన్ కెపాసిటీ లేదా పొడవును బట్టి నిర్వచించి, వాటికి ఏదైనా ఆఫర్లు లేదా ప్రోత్సాహకాలు ఇవ్వాలా అనే దానిపైనా ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం CAFE II నార్మ్స్ 2027 మార్చి వరకు అమలులో ఉన్నాయి. వీటి ప్రకారం కార్ల కంపెనీలు తమ వాహనాల నుంచి కిలోమీటర్‌కు గరిష్టంగా 113.1 గ్రాముల CO2 కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేయాలి. రాబోయే CAFE III నార్మ్స్ లో దీన్ని ఇంకా కఠినతరం చేయాలని చూస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కొత్తగా 91.7g/km అనే లక్ష్యాన్ని ప్రపోజ్ చేసింది. కార్ల కంపెనీలు మాత్రం, భారత్ కు తగ్గట్టుగా 92.9g/km పరిమితిని అడుగుతున్నాయి.
కార్ల కంపెనీలు ఇంకో విషయం చెబుతున్నాయి. మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లు వాడకం అనుకున్నంత వేగంగా పెరగడం లేదట. కాబట్టి, CAFE III కాలుష్య నిబంధనలను కొంచెం సడలించాలని వాళ్లు కోరుతున్నారు. ప్రస్తుతం మన మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌యూవీల మార్కెట్ షేర్ 55శాతం కంటే ఎక్కువ ఉంది. కానీ, ఎస్‌యూవీలు సాధారణంగా తక్కువ మైలేజ్ ఇస్తాయి. ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. ఇదే కార్ల కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది.