Balak Ram: అయోధ్య బాలరాముడికి కొత్త పేరు..

Balak Ram: ఆలయాన్ని బాలక్‌ రామ్‌ మందిర్‌గా పిలుస్తామన్న ట్రస్ట్ పూజారి

Update: 2024-01-24 05:57 GMT

Balak Ram: అయోధ్య బాలరాముడికి కొత్త పేరు.. 

Balak Ram: అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుతీరాడు. గర్భగుడిలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. అక్కడ కొలువైన బాల రాముడిని ఇప్పటి వరకు రామ్ లల్లా అని పిలిచారు. ఇప్పుడు బాల రాముడి పేరును మార్చారు. ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇకపై ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.

Tags:    

Similar News