అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు.. కొత్త జీఎస్టీ రేట్లు వీటిపైనే..

New GST Rates: ఇవాళ్టి నుంచి జీఎస్టీ రేట్లు తాజాగా అమల్లోకి వచ్చాయి.

Update: 2022-07-18 13:47 GMT

అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు.. కొత్త జీఎస్టీ రేట్లు వీటిపైనే..

New GST Rates: ఇవాళ్టి నుంచి జీఎస్టీ రేట్లు తాజాగా అమల్లోకి వచ్చాయి. కొన్ని ఉత్పత్తులు, సేవల ధరలు పెరిగిపోగా మరికొన్ని తగ్గాయి. గత నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రేట్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొనుగోలు చేసే తినుబండారాలు, అప్పడాలు, మురుకులు, జంతికలు, మిక్చర్ తదితర ప్యాక్ చేసి విక్రయించే వస్తువులవై 5 శాతం జీఎస్టీ వేశారు. పెరుగు, ఆసుపత్రుల్లో 5 వేలకు మించిన రూమ్ రెంట్ పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటివరకు వీటిపై జీఎస్టీ లేదు. ఇక టెట్రా ప్యాక్ లపై 18 శాతం జీఎస్టీ అమలు కానుంది.

ఇక బ్యాంకులు జారీ చేసే చెక్కుల మీద వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. మ్యాప్ లు, చార్ట్ లు, అట్లాస్ ల పైనా 12 శాతం జీఎస్టీ పడుతోంది. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్ చాక్ పీసులు, పేపర్లు కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్పెనర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెరిగింది. సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటివరకు 5 శాతం జీఎస్టీ ఉంటే అది కాస్తా 12 శాతానికి పెంచారు. రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, శ్మశాన వాటికల సేవలపై 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు.

జీఎస్టీ సవరణల ద్వారా కొన్ని వస్తు, సేవల్లో పన్నుశాతం తగ్గింది. రోప్ వేల ద్వారా వస్తువుల రవాణా, ప్రయాణికుల రవాణా సేవలపై 12 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించారు. వాయు మార్గాన ఈశాన్య రాష్ట్రాల్లో బాగ్రోడియాకు తీసుకెళ్లే ప్రయాణికుల సేవలపై జీఎస్టీని మినహాయించారు. ట్రక్కులు, గూడ్స్ క్యారియర్ల అద్దెలపై సర్వీస్ చార్జీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు 5 శాతం రాయితీ జీఎస్టీ రేటుకు లభిస్తాయి.

Tags:    

Similar News