Modi-Putin Meet at Hyderabad House: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
Putin India Visit: భారతదేశ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు.
Modi-Putin Meet at Hyderabad House: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
Putin India Visit: భారతదేశ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరుదేశాల మధ్య జరుగుతున్న 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు అగ్రనేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ రంగం సహా పలు కీలక అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా కుదిరే అవకాశం ఉంది. అనంతరం, ప్రధాని మోదీ మరియు అధ్యక్షుడు పుతిన్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
అంతకుముందు, వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌ను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రష్యా అధ్యక్షుడు త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఇరుదేశాల అధికారుల బృందాలను పరస్పరం పరిచయం చేసుకున్నారు.
రాష్ట్రపతి భవన్ కార్యక్రమం ముగిసిన తర్వాత పుతిన్ నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి సందర్శకుల పుస్తకంలో సందేశాన్ని కూడా రాశారు.